పాఠ్యక్రమం → Level 9 · నామవాచకం-విభక్తి → పాఠం 5

Level 9 · Lesson 5

బహువచన రూపాలు
Forming the plural

'లు' ప్రత్యయం చేరినప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులు — ఇల్లు → ఇళ్ళు, ఊరు → ఊళ్ళు, చెయ్యి → చేతులు.

The plural suffix -లు and the stem changes it sets off, from ఇళ్ళు to చేతులు.

గుర్తు చేసుకోండి · You already know this

మీరు ఇప్పటికే 'రెండు ఇళ్ళు', 'నా చేతులు', 'మా ఊళ్ళు' అని చెప్పగలరు. కానీ ఇల్లుకు 'లు' చేరితే 'ఇల్లులు' రావాలి కదా? రాలేదు. ఎందుకో ఈ పాఠంలో చూద్దాం.

Last lesson the plural looked easy: add -లు. Then you remember ఇల్లు becoming ఇళ్ళు, ఊరు becoming ఊళ్ళు, చెయ్యి becoming చేతులు, and the rule seems to fall apart. It does not. The suffix is always -లు; what varies is what happens to the stem in front of it.

సూత్రాలు · The rules

బహువచన ప్రత్యయం 'లు' ఒకటే; అది చేరినప్పుడు కొన్ని పదాల ప్రకృతి రూపం మారుతుంది. ఈ మార్పులను వాడుక ద్వారానే గుర్తుంచుకోవాలి.
సూత్రం 1

పువ్వు – పువ్వులు, పులి – పులులు, తోట – తోటలు: ఇక్కడ ప్రకృతి అలాగే ఉంది. ఇల్లు – ఇళ్ళు, ఊరు – ఊళ్ళు: ఇక్కడ ప్రకృతి మారింది. ప్రత్యయం మాత్రం రెండుచోట్లా 'లు' నే.

Hold on to this and the chapter stays simple: there is only one plural suffix. పువ్వులు and ఇళ్ళు are built the same way; in the second the base itself has been reshaped before the ending lands on it. The changes are few, they are common, and you already say most of them correctly.

'ము' తో అంతమయ్యే తత్సమ పదాలు బహువచనంలో గ్రాంథికంలో 'ములు', వ్యావహారికంలో 'ఆలు' రూపాన్ని పొందుతాయి.
సూత్రం 2

పుస్తకము – పుస్తకములు (గ్రాంథికం) – పుస్తకాలు (వ్యావహారికం). వనము – వనములు – వనాలు. ఫలము – ఫలములు – ఫలాలు. ఈనాటి రాతలో 'ఆలు' రూపమే సాధారణం.

Neuter tatsama nouns in -ము have two plurals: the literary పుస్తకములు and the everyday పుస్తకాలు. Both are correct in their own register, and modern prose almost always chooses the second. Do not mix registers inside one sentence.

ఇల్లు, ఊరు, కాలు, నీరు, కన్ను, రాయి వంటి పదాలలో బహువచన రూపం 'ళ్ళు' తో ముగుస్తుంది.
సూత్రం 3

ఇల్లు – ఇళ్ళు, ఊరు – ఊళ్ళు, కాలు – కాళ్ళు, నీరు – నీళ్ళు, కన్ను – కళ్ళు, రాయి – రాళ్ళు. ఇవన్నీ నిత్యం వాడే పదాలే; ఒక్కసారి కంఠస్థం చేస్తే చాలు.

A closed set of very frequent nouns takes -ళ్ళు: ఇళ్ళు, ఊళ్ళు, కాళ్ళు, నీళ్ళు, కళ్ళు, రాళ్ళు. Note the ళ, not ల — the distinction is written and pronounced, and getting it wrong is one of the commonest learner errors. Learn the six as a list.

కొన్ని పదాల బహువచన రూపం ప్రకృతికి బాగా దూరంగా ఉంటుంది; వీటిని ఒక్కొక్కటిగా నేర్చుకోవాలి.
సూత్రం 4

చెయ్యి – చేతులు. ఇక్కడ 'చెయ్యి' లోని అక్షరాలు దాదాపు ఏవీ మిగలలేదు; బహువచనం 'చేతు' అనే వేఱే ప్రకృతిపై ఏర్పడింది. చెట్టు – చెట్లు కూడా ఇలాంటిదే, కానీ మార్పు చిన్నది.

చెయ్యి and చేతులు barely share a syllable: the plural is built on a different stem altogether, చేతు-. చెట్టు giving చెట్లు is a milder case of the same thing. There is no rule to derive these from — they are learnt one at a time, like English foot and feet.

ప్రక్రియ · Step by step

ఇల్లు + లు → ఇళ్ళు
  1. ఇల్లు — ప్రకృతి — ఏకవచనం
  2. ఇల్లు + లు — బహువచన ప్రత్యయం చేరింది
  3. ఇళ్ళు — ప్రకృతిలో మార్పు — 'ల్లు' స్థానంలో 'ళ్ళు'
పుస్తకము + లు → పుస్తకాలు
  1. పుస్తకము — ప్రకృతి — తత్సమ నపుంసకలింగం
  2. పుస్తకము + లు → పుస్తకములు — గ్రాంథిక బహువచన రూపం
  3. పుస్తకాలు — వ్యావహారిక రూపం — 'ము' స్థానంలో 'ఆ'
చెయ్యి + లు → చేతులు
  1. చెయ్యి — ప్రకృతి — ఏకవచనం
  2. చేతు- — బహువచనంలో వచ్చే వేఱే ప్రకృతి
  3. చేతు + లు → చేతులు — సిద్ధ రూపం

అభ్యాసం · Practice

మా ఊరిలో రెండు ________ మాత్రమే ఉన్నాయి. (ఇల్లు) There are only two houses in our village.
'చెయ్యి' బహువచనం ఏది? What is the plural of చెయ్యి?
ఏకవచనాన్ని దాని బహువచనంతో జతపరచండి. Match each singular to its plural.
వీటిలో బహువచనంలో ప్రకృతి మారని పదం ఏది? In which of these does the stem stay unchanged in the plural?
దాహంగా ఉంది; కొన్ని ________ ఇవ్వండి. (నీరు) I am thirsty; please give me some water.