పాఠ్యక్రమం → Level 4 · కాలాలు → పాఠం 16

Level 4 · Lesson 16

మరియు, కానీ, లేదా
And, but, or

రెండు వాక్యాలను కలపడం — మరియు, కానీ, లేదా, అయితే.

Joining two clauses, and why మరియు belongs to writing rather than speech.

వినండి · Listen

దుకాణం, సినిమా

సీత — నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు?
Where did you go yesterday?
రవి — నిన్న నేను దుకాణానికి వెళ్ళాను. కూరగాయలు కొన్నాను.
Yesterday I went to the shop. I bought vegetables.
సీత — పండ్లు కొన్నావా?
Did you buy fruit?
రవి — లేదు, పండ్లు కొనలేదు. కానీ బియ్యం కొన్నాను.
No, I did not buy fruit. But I bought rice.
సీత — రేపు మనం సినిమాకు వెళ్తామా, లేదా ఇంట్లో ఉంటామా?
Tomorrow, shall we go to the cinema, or shall we stay at home?
రవి — రేపు నాకు పని ఉంది. అయితే ఎల్లుండి రాగలను.
Tomorrow I have work. But then I can come the day after.
సీత — సరే. ఈ పుస్తకంలో ఇలా ఉంది — 'ఈరోజు మరియు రేపు సెలవు.'
All right. This book says: 'Today and tomorrow are holidays.'
రవి — అవును, రాతలో 'మరియు'. మాటలో మనం అలా చెప్పము.
Yes — మరియు in writing. In speech we do not say it that way.

వివరణ · Explanation

ఒక వాక్యం, తరువాత రెండో వాక్యం. మధ్యలో పదం లేదు — 'దుకాణానికి వెళ్ళాను. కూరగాయలు కొన్నాను.'

Spoken Telugu joins two statements simply by putting one after the other: దుకాణానికి వెళ్ళాను. కూరగాయలు కొన్నాను. There is no little word doing the work of English 'and'. A short pause is the join, and a learner who reaches for a word here will sound like a written notice.

'కానీ' — వ్యతిరేకం. 'నాకు టీ కావాలి, కానీ కాఫీ వద్దు.' 'అయితే' కూడా అలాగే — 'నాకు తెలుసు, అయితే నేను చెప్పను.'

కానీ stands between two clauses and marks the second as going against the first: పండ్లు కొనలేదు, కానీ బియ్యం కొన్నాను. అయితే does the same job with a softer, more conversational feel, closer to English 'but then' or 'still' — నాకు తెలుసు, అయితే నేను చెప్పను. Both come at the head of the second clause, never at the end of the sentence.

'లేదా' — రెండింటిలో ఒకటి. 'మీరు టీ లేదా కాఫీ తాగుతారా?' 'మరియు' — రాతలో; మాటలో ఎప్పుడూ కాదు.

లేదా offers a choice between two things or two whole clauses: టీ లేదా కాఫీ, and వెళ్తామా, లేదా ఉంటామా? మరియు is the written 'and' — you will meet it in books, notices and formal letters, and you should recognise it at sight. In conversation, leave it alone and let the pause join your sentences.

పదాలు · Vocabulary

పదం Meaning గమనిక · Note
మరియు and written style only
కానీ but, however heads the second clause
లేదా or joins two choices
అయితే but then, however softer than కానీ

అభ్యాసం · Practice

'నాకు టీ కావాలి, ________ కాఫీ వద్దు.' I want tea, but I do not want coffee.
మీరు టీ ________ కాఫీ తాగుతారా? Will you drink tea or coffee?
వాక్యం — 'I went, but he did not come.' Arrange the words.
ఏ పదం రాతలో మాత్రం వస్తుంది? Which word belongs to written Telugu, not to speech?
జతపరచండి. Match each joining word with its meaning.

మీరే చెప్పండి · Use it

నిన్న మీరు ఏం చేశారు? రెండు వాక్యాలు చెప్పండి. తరువాత 'కానీ' వాడండి — 'నేను … కానీ …'. చివరగా ఒక ప్రశ్న — '… లేదా …?'

Say two things you did yesterday, one sentence after the other, with nothing between them: నిన్న నేను దుకాణానికి వెళ్ళాను. కూరగాయలు కొన్నాను. Then say one sentence that turns: నేను వెళ్ళాను, కానీ … . Finish by offering someone a choice out loud — టీ లేదా కాఫీ తాగుతారా? Notice that you never once needed మరియు.